అల్లు శిరీష్ “ఊర్వశివో రాక్షసివో” టీజర్ రాక అప్పుడే !

Published on Sep 26, 2022 10:26 am IST

అల్లు శిరీష్ హీరోగా అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా రాబోతున్న కొత్త చిత్రం “ఊర్వశివో రాక్షసివో”. కాగా ఈ సినిమా టీజర్ సెప్టెంబర్ 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా కొత్త టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో అల్లు శిరీష్ – అను ఇమ్మానియేల్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ పోస్టర్ ను బట్టి.. ఇదొక రొమాంటిక్ డ్రామా అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేసేందుకు మేకర్స్ ప్రస్తుతం ప్రాజెక్ట్‌ పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందట. ముఖ్యంగా అను ఇమ్మాన్యుయేల్‌ – అల్లు శిరీష్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట. కాగా శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, GA2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకి అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు. తన్వీర్ సినిమాటోగ్రఫీ ని అందిస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :