అల్లు శిరీష్, తమన్నాలకు అక్కడ పనేంటి?

19th, October 2016 - 04:33:10 PM

allu-serish-thammanh
‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో తన కెరీర్‌కు ఎంతో అవసరమైన హిట్ కొట్టేసిన అల్లు శిరీష్, ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా శిరీష్, బాలీవుడ్ దర్శకుడు పునీత్ మల్హోత్రా, హీరోయిన్ తమన్నాలతో కలిసి సెట్లో దర్శనమిచ్చారు. పునీత్ మల్హోత్రా ఇదే ఫోటోను పోస్ట్ చేస్తూ “మేము ఏం షూట్ చేస్తున్నామని అడగొద్దు!” అన్నారు. దానికి తమన్నా కూడా ‘షూట్ బాగా జరిగిందని, ఫన్ షూట్’ అని రిప్లై ఇచ్చారు.

అల్లు శిరీష్, పునీత్ మల్హోత్రా, తమన్నా.. ఈ ముగ్గురు కలిసి ఏదో సెట్లో చేసిన పనేంటి? ఆ షూట్ ఏంటీ? అన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకమే! ఏదైనా యాడ్ ఫిల్మ్ షూట్ కోసం ఈ ముగ్గురూ ఒకదగ్గర చేరారా అని ఎక్కువగా వినిపిస్తోంది. పునీత్‌తో కలిసి పనిచేయడం సరదాగా ఉందని, ఆయన దర్శకత్వంలో మరోసారి నటించాలని కోరుకుంటున్నా అని అల్లు శిరీష్ తెలపడం కొసమెరుపు.