డిఫరెంట్ కాన్సెప్ట్ తో అల్లు శిరీష్ సినిమా
Published on Oct 16, 2017 3:44 pm IST

‘’ఎక్కడికి పోతావు చిన్నవాడ’’ సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు వి.ఐ.ఆనంద్ తాజాగా అల్లు శిరీష్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు శిరీష్ కూడా ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంతో మంచి సక్సెస్ మీద ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెండు జంటలమద్య జరిగే కథగా ఉంటుందని తెలుస్తోంది . ప్యార్లల్ లైఫ్ అనే కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఈ సినిమా ఉండబోతుంది. ఇంతవరుకు తెలుగులో ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ రాలేదనే చెప్పాలి.

ఈ సినిమా తో ‘అల్లు శిరీష్’ ‘వి.ఐ ఆనంద్’ మంచి విజయం అందుకునే అవకాశాలు ఉన్నాయట. దాసరి నారాయణ రావ్ గారి అబ్బాయి విష్ణు ఈ సినిమా ద్వారా ఒక మంచి పాత్రతో రీ ఎంట్రి ఇస్తున్నాడు, ఆ పాత్ర కథను మలుపు తిప్పేదిగా ఉండనుండటం విశేషం. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సురభి హీరోయిన్ గా నటిస్తుండగా అవసరాల శ్రీనివాస్, శీరత్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ‘టైగర్’ ‘డిజే’ వంటి చిత్రాలకు పనిచేసిన చోటా కే ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్.

 
Like us on Facebook