పవన్‌కు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ బయటపెట్టిన మెగా హీరో!

Allu-Sirish
టాలీవుడు స్టార్ హీరో, అప్ కమింగ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన లైఫ్ అంతా తెరిచిన పుస్తకం లాంటిదే. ఆయన సినిమా, వ్యక్తిగత జీవితాల్లో జరిగిన ముఖ్యమైన ప్రతి అంశం అభిమానులకు తెలుసు. అయినా కూడా ఆయన గురించి కొత్త విషయాలు, విశేషాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారి కోసమే అన్నట్టుగా పవన్ మేనల్లుడు అల్లు శిరీష్, పవన్ బర్త్ డే సందర్బంగా ఆయన గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను బయటపెట్టాడు.

అవేమిటంటే పవన్ ఎక్కువగా ఆయుర్వేదాన్ని ఉపయోగిస్తాడట. ఎప్పుడూ ఉసిరికాయలు తింటాడట. అవే అయన గ్లామర్ గా ఉండటానికి కారణమట. అలాగే అందరూ హత యోగాను ప్రాక్టీస్ చేస్తే పవన్ మాత్రం మోస్ట్ అడ్వాన్స్డ్ అష్టాంగ యోగాను చేస్తాడట. ఇంకా ఆయన రాజకీయాలు, వేదాంతం, తత్వశాస్త్రానికి సంబందించిన పుస్తకాలను ఎక్కువగా చదువుతాడట. ఇక చివరగా 2007 లో తనకు కార్ యాక్సిడెంట్ జరిగితే పవన్ తనను చూడటానికి వచ్చి కంట నీరు పెట్టుకున్నారట. అది చూసి ఆయన ఎంత సున్నితమైన మనిషో తనకర్థమైందంటూ శిరీష్ చెప్పుకొచ్చాడు.