పవన్ కు అల్లు హీరోలకు మధ్య విభేదాల్లేవ్.. ఇదే సాక్ష్యం !


గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ కు, అల్లు హీరోలకు మధ్య పొసగడంలేదని రక రకాల వార్తలు బయటికొచ్చాయి. ఒకానొక దశలో ఈ వార్తలు అభిమానుల మధ్య గందరగోళానికి కూడా కారణమయ్యాయి. ఇప్పటికీ కొందరు వీరీ మధ్య ఏదో పెద్ద గొడవే ఉందని అనుకుంటున్నారు. కానీ అలాంటివేమీ లేవని ఇదివరకే పలు సందర్భాల్లో అల్లు హీరోలు ప్రస్తావించగా తాజాగా అల్లు శిరీష్ చేసిన ఒక ట్వీట్ ఇదే విషయాన్ని గుర్తుచేసింది.

రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఉద్దానం సమస్యపై చర్చలు జరిపి సమస్య పరిష్కారం దిశగా ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ చంద్రబాబు ట్విట్టర్లో ఉద్దానం పట్ల ఇంత శ్రద్ద చూపిస్తున్నందుకు పవన్ ను అభినందిస్తున్నాను అన్నారు. దానికి ప్రతిగా అల్లు శిరీష్ ఇద్దరు నాయకులు రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయడం గొప్ప విషయం అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు.

శిరీష్ అభిప్రాయాన్ని చూసిన చంద్రబాబు అతనికి థ్యాంక్స్ చెబుతూ ప్రజలే తమకు ముఖ్యమని, వాళ్ళ కోసమే పనిచేస్తామంటూ బదులిచ్చారు. దీన్ని బట్టి పవన్, అల్లు కుటుంబాల మధ్య కొందరు అనుకుంటున్నట్లు ఎలాంటి గొడవలులేవని మరోసారి అర్థమవుతోంది.