డబ్బింగ్ పూర్తిచేసే పనిలో ఉన్న మెగాహీరో !

ఈ ఏడాది మెగా ఫ్యామిలీ హీరోల నుండి రాబోతున్న ఆఖరి చిత్రం అల్లు శిరీష్ యొక్క ‘ఒక్క క్షణం’. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ డైరెక్టర్ విఐ.ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా యొక్క టీజర్, ట్రైలర్స్ బాగుండటంతో చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. పార్లల్ లైఫ్స్ అనే కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 28న రిలీజ్ చేయనున్నారు.

అందుకే ఎక్కువ వ్యవధి లేనందున తన పాత్ర తాలూకు డబ్బింగ్ ను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నారు అల్లు శిరీష్. ప్రస్తుతం డబ్బింగ్ ఆఖరి దశకు చేరుకుందట. అంతేగాక ఈ నెల 20 నుండి ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టనున్నారు చిత్ర యూనిట్. చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రంలో శిరీష్ కు జోడీగా సురభి, శీరత్ కపూర్ లు నటించారు.