సైన్స్ ఫిక్షన్‌కే ఓటేసిన మెగా హీరో!

allu-sirish
యంగ్ మెగా హీరో అల్లు శిరీష్ ఈ మధ్యే ‘శ్రీరస్తు శుభమస్తు’ అన్న సినిమాతో మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో తడబడ్డ ఈ హీరో, ఆ తర్వాత కొద్దికాలం గ్యాప్ తీసుకొని మరీ శ్రీరస్తు శుభమస్తు అన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వచ్చి మెప్పించారు. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ తనకు అలాంటి స్థాయి హిట్ ఇచ్చే సినిమాయే చేయాలన్న ఆలోచనలో శిరీష్ ఎంతో జాగ్రత్తగా ఎం.వీ.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశారు. అయితే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండడంతో ఆయన వేరే కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.

వీఐ ఆనంద్ దర్శకత్వంలో తన కొత్త సినిమా ఉంటుందని అల్లు శిరీష్ స్పష్టం చేశారు. ‘టైగర్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్, ప్రస్తుతం నిఖిల్‌తో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా!’ అన్న సినిమా చేస్తున్నారు. ఓ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో శిరీష్-వీఐ ఆనంద్ సినిమా తెరకెక్కనుందట. ఒకే జానర్‍లో సినిమాలు చేస్తే కొత్తదనం ఉండదని శిరీష్ చాలా ఆలోచించి ఈ సినిమాకు ఓకే చెప్పారట.