అల్లు అర్జున్‌ ఫేవరేట్ ఫుడ్ ఏంటో చెప్పిన స్నేహారెడ్డి

Published on Apr 24, 2022 9:40 pm IST

సౌత్ ఇండియన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం పుష్ప ది రూల్ కోసం సిద్ధమవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైజ్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ రోజు, హీరో భార్య అల్లు స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు.

అల్లు అర్జున్‌కి ఇష్టమైన ఆహారాన్ని వెల్లడించమని ఆమె ఫాలోవర్ లలో ఒకరు అడిగారు. అతనికి బిర్యానీ అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. స్నేహారెడ్డి తెలిపిన సమాధానం కి చాలా లైక్స్ మరియు రిప్లైస్ కూడా వచ్చాయి. పుష్ప ది రైజ్ లో కనిపించిన రష్మిక మందన్న మరియు ఇతర ముఖ్య నటీనటులు రెండవ పార్ట్ పుష్ప ది రూల్ లో కూడా ఉంటారు. ఇంకా సెట్స్ పైకి వెళ్లని ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం :