ఫోటో మూమెంట్: అల్లు అర్జున్ తో స్నేహ… బిగ్ డే అంటూ సోషల్ మీడియా లో పోస్ట్

Published on Dec 17, 2021 4:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం మొదటి భాగం అయిన పుష్ప ది రైజ్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ చిత్రం తో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా ఎదిగారు అని చెప్పాలి. అల్లు అర్జున్ కి మాత్రమే కాకుండా పుష్ప టీమ్ అందరికీ కూడా ఇది చాలా బిగ్ డే అని అనడం లో ఎలాంటి సందేహం లేదు. తాజాగా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదిక గా ఒక పోస్ట్ చేశారు.

అల్లు అర్జున్ తో సెల్ఫి దిగిన ఫోటో ను అభిమానుల తో పంచుకున్నారు. బిగ్ డే అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రష్మిక హీరోయిన్ గా, సమంత స్పెషల్ సాంగ్ లో నటించగా, సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ ఫజిల్ లు కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :