శ్రీవిష్ణు ‘అల్లూరి’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

Published on Sep 15, 2022 12:49 am IST


యువ నటుడు శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ అల్లూరి. ఈ మూవీ లో శ్రీవిష్ణు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పాత్రలో నటించగా బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ మూవీకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో కయ్యద్ లోహర్‌ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమవుతున్నారు. తనికెళ్ల భరణి, మధుసూధన్‌ రావు, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటించిన ఈ మూవీకి సంగీతం హర్షవర్ధన్‌ రామేశ్వర్ అందించగా కెమెరామెన్ గా రాజ్‌ తోట వర్క్ చేశారు.

ఇప్పటికే అల్లూరి నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్, టీజర్ మూవీ పై ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీని ఏర్పరచగా ఈ మూవీ యొక్క అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ని సెప్టెంబర్ 16 న రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అనౌన్స్ చేసింది. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు ప్రదీప్ వర్మ ఈ మూవీని రూపొందించగా అల్లూరి అనే పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో శ్రీవిష్ణు అదగొట్టారని, సెప్టెంబర్ 23న రిలీజ్ కానున్న ఈ మూవీ తప్పకుండా మంచి విజయం అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :