లేటెస్ట్..ప్రభాస్ – మారుతీ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ కి టైం ఫిక్స్.!

Published on Jul 1, 2022 8:00 am IST


ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ తన లైనప్ లో ఇంకా అనౌన్స్ కావాల్సిన సినిమాలు కూడా కొన్ని ఉండగా వాటిలో దర్శకుడు మారుతీ తో ప్లాన్ చేసిన సినిమా కూడా ఒకటి. అయితే ఈ కాంబోలో సినిమా ఉందని అందరికీ తెలిసిందే కానీ ఇంకా అధికారికంగా అయితే అనౌన్స్ కాలేదు. కానీ మారుతీ అయితే చాలా సార్లు ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నే పలు ఇంటర్వ్యూస్ లో అందించారు.

ఇక ఇప్పుడు తాజాగా అయితే ప్రస్తుతం తాను తెరకెక్కించిన “పక్కా కమర్షియల్” ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో సినిమాపై అదిరే క్లారిటీ అందించారు. తన నెక్స్ట్ సినిమాపై అనౌన్సమెంట్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమా అనంతరం ఒక 10 రోజులు తర్వాత అలా అనౌన్స్ చేస్తామని బిగ్ క్లారిటీ ఇచ్చారు. దీనితో ఈ భారీ ప్రాజెక్ట్ పై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :