స్పై యూనివ‌ర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ‘ఆల్ఫా గ‌ర్ల్స్’

స్పై యూనివ‌ర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ‘ఆల్ఫా గ‌ర్ల్స్’

Published on Jul 5, 2024 12:44 PM IST

బాలీవుడ్ లో య‌శ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివ‌ర్స్ కు ప్ర‌త్యేక క్రేజ్ ఉంది. ఈ స్పై యూనివ‌ర్స్ లో ఇప్ప‌టికే వ‌చ్చిన సినిమాలు ఇండియ‌న్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ స్పై యూనివ‌ర్స్ లోకి తాజాగా ‘ఆల్ఫా గర్ల్స్’ ఎంట్రీ ఇచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం హీరోలే ఈ స్పై యూనివ‌ర్స్ లో ఉండ‌గా, ఇప్పుడు హీరోయిన్లు మెయిల్ లీడ్ గా ఎంట్రీ ఇస్తున్నారు.

ఫీమేల్ ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్ తో య‌శ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివ‌ర్స్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రానికి ‘ఆల్ఫా గ‌ర్ల్స్’ అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ ఆలియా భట్ తో పాటు మ‌రో న‌టి శ‌ర్వారీ కూడా న‌టిస్తోంది. ”గ్రీక్ ఆల్ఫాబెట్ లో తొలి అక్ష‌రం.. మ‌న ప్రోగ్రాం మోటో..” అంటూ సాగే ఓ ప‌వ‌ర్ఫుల్ డైలాగ్ తో ఈ చిత్ర టైటిల్ ను రివీల్ చేశారు మేక‌ర్స్.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు య‌శ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివ‌ర్స్ లో ఏక్ థా టైగ‌ర్, టైగ‌ర్ జిందా హై, వార్, ప‌ఠాన్, టైగ‌ర్ 3 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ స్పై యూనివ‌ర్స్ లో ప‌ఠాన్-2, టైగ‌ర్ వ‌ర్సెస్ ప‌ఠాన్, వార్-2 చిత్రాలు రానున్నాయి. ఇక ‘ఆల్ఫా గ‌ర్ల్స్’ చిత్రాన్ని శివ్ ర‌వైల్ డైరెక్ట్ చేస్తుండ‌గా, ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు