“బాలయ్య 108” కి అప్పుడే రిలీజ్ డేట్ ఫిక్స్..?

“బాలయ్య 108” కి అప్పుడే రిలీజ్ డేట్ ఫిక్స్..?

Published on Aug 19, 2022 10:37 AM IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన కెరీర్ లో 107వ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై ఆల్రెడీ భారీ అంచనాలు నెలకొనగా ఇది ఒక అవుట్ అండ్ అవుట్ సీమ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇక దీని తర్వాత అయితే పూర్తిగా దీనికి డిఫరెంట్ గా దర్శకుడు అనీల్ రావిపూడితో బాలయ్య 108వ సినిమా చేస్తున్నారు.

మరి ఇది కూడా రీసెంట్ గానే అనౌన్స్ కాగా దీనికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాక్ బయటకి వచ్చింది. దీని ప్రకారం అయితే అల్రెడీ మేకర్స్ రిలీజ్ డేట్స్ ని లాక్ చేసేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోనే ఈ సినిమా రిలీజ్ ఉండొచ్చట. మరి ప్రస్తుతానికి అయితే ఏప్రిల్ 7న వస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అయితే మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు