హాట్ బజ్..అప్పుడే “అఖండ” రీమేక్ కి సన్నాహాలు.?

Published on Dec 8, 2021 8:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ చిత్రం “అఖండ”. భారీ అంచనాలతో విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది మరో పెద్ద హిట్ గా ఈ చిత్రం నిలిచింది. అయితే ఈ సినిమా పెద్ద ఎత్తున ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేసింది.

బోయపాటి ఎంచుకున్న నేపథ్యం అందరికీ టచ్ అయ్యేదిలా ఉండడంతో బాలీవుడ్ వర్గాల కళ్ళు కూడా అఖండ సక్సెస్ పై పడ్డాయని ఓ హాట్ బజ్ వైరల్ అవుతుంది. మరి అందుకే ఆల్రెడీ ఈ సినిమా రీమేక్ నిమిత్తం సన్నాహాలు కూడా స్టార్ట్ అయ్యినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆల్రెడీ ఇద్దరు బాలీవుడ్ బిగ్ స్టార్స్ పేర్లు ఈ సినిమా హీరోగా వినిపిస్తున్నాయని కూడా టాక్ వినిపిస్తుంది. మరి దీనిలో ఎంతవరకు నిజముందో వేచి చూస్తే తెలుస్తుంది. మరి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలో ప్రగ్యా జైవాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :