బజ్..”RRR” మూడో సాంగ్ కి కూడా డేట్ ఫిక్స్ అయ్యిందా?

Published on Nov 11, 2021 4:06 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మరియు యాక్షన్ థ్రిల్లర్ “రౌద్రం రణం రుధిరం” నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ మాస్ సాంగ్ “నాటు నాటు” తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మాస్ మరియు గ్రౌండ్ లెవెల్లో ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్న ఈ సాంగ్ యుఫొరియా కంప్లీట్ అవ్వకముందే ఇంకో ఇంట్రెస్టింగ్ బజ్ ఈ సినిమా నుంచి మూడో సాంగ్ పై స్టార్ట్ అయ్యింది.

లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ని చిత్ర యూనిట్ వచ్చే నవంబర్ 18న రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేశారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్రెడీ ఎంఎం కీరవాణి ఇచ్చిన రెండు పాటలు కూడా పెద్ద చార్ట్ బస్టర్స్ అయ్యాయి ఇక ఈ మూడో సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఈ చిత్రంలో అజయ్ దేవగన్, ఆలియా భట్ తదితర అగ్ర తారాగణం నటించారు. అలాగే డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More