అప్పుడే పవన్, సాయి తేజ్ సినిమా నుంచి లీక్స్.!

Published on Feb 26, 2023 9:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరోగా పలు సినిమాల్లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలతో పాటుగా ఓ గెస్ట్ రోల్ లో చేస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. మెయిన్ లీడ్ లో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తుండగా రీసెంట్ గానే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మరి ఈ సినిమా అయితే ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటుండగా ఆల్రెడీ సెట్స్ నుంచి లీక్స్ బయటకు వచ్చేసి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

దీనితో చిత్ర యూనిట్ ఏం చేస్తున్నారని కొందరు పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఆల్రెడీ పవన్ లుక్ తో సినిమాపై సాలిడ్ హైప్ వచ్చింది. మరి లీక్స్ పరంగా మేకర్స్ ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాలి. ఇక ఈ సినిమాకి అయితే సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా తెలుగులో డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే, మార్పులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చూసుకుంటున్నారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఆగస్ట్ లో రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :