“పుష్పక విమానం” హిందీ రీమేక్ కి మంచి డిమాండ్..!

“పుష్పక విమానం” హిందీ రీమేక్ కి మంచి డిమాండ్..!

Published on Nov 17, 2021 10:53 PM IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “పుష్పక విమానం”. ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతుంది. అయితే మన తెలుగు సినిమాలకి హిందీ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.

అలా ఇప్పుడు ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. బాలీవుడ్ నుంచి మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు “పుష్పక విమానం” రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. కొత్త తరహా కథలో కామెడీ, మిస్టరీ కలిసి ఉండటం “పుష్పక విమానం” ను యూనిక్ మూవీగా మార్చాయి. సినిమాలోని ఈ క్వాలిటీనే బాలీవుడ్ మేకర్స్ ను రీమేక్ కు పోటీ పడేలా చేస్తున్నాయి.

యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. “పుష్పక విమానం” బాలీవుడ్ రీమేక్ గురించి ఈ మూడు ప్రతిష్టాత్మక సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆ సంస్థల వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తాం అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తాజాగా తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు