డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన అమలా పాల్ “ది టీచర్”

Published on Dec 18, 2022 2:30 pm IST

నటి అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ది టీచర్ ఈ వారంలో డిజిటల్ ప్రీమియర్ చేయడానికి సిద్ధంగా ఉంది. వివేక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 2, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 23, 2022న ప్రీమియర్‌గా ప్రసారం కానుంది.

ప్రస్తుతానికి, సినిమా యొక్క డబ్బింగ్ వెర్షన్‌ల గురించి ఎటువంటి సమాచారం లేదు. వరుణ్ త్రిపురనేని మరియు అభిషేక్ రామిశెట్టి నిర్మించిన ది టీచర్‌లో మంజు పిళ్లై, చెంబన్ వినోద్, హకీమ్ షాజహాన్, ప్రశాంత్ మురళి, నందు, తదితరులు కీలక పాత్రలు పోషించారు. డాన్ విన్సెంట్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :