రీ ఎంట్రీకి సిద్దమైన ఇద్దరు హీరోయిన్లు !

ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లుగా కొనసాగిన స్నేహా ఉల్లాల్, అమలాపాల్ ఇద్దరూ చాన్నాళ్ల పాటు తెలుగు సినిమాలకు దూరంగానే ఉన్నారు. స్నేహా ఉల్లాల్ చివరగా 2013లో వచ్చిన ‘అంతా నీ మాయలోనే’ లో కనిపించగా, అమలా పాల్ మాత్రం 2015లో వచ్చిన ‘జెండాపై కపిరాజు’ తరవాత మరే డైరెక్ట్ తెలుగు సినిమా చేయలేదు.

ఇప్పుడీ ఇద్దరు హీరోయిన్లు కలిసి చేస్తున్న ‘ఆయుష్మాన్ భవ’ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇందులో అమలాపాల్ ముస్లిమ్ యువతిగా నటిస్తుండగా స్నేహా ఉల్లాల్ మాత్రం స్టైలిష్ గా కనిపిచనుంది. ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రాన్ని చరణ్ తేజ్ నిర్మిస్తూ హీరోగా నటిస్తుండటం విశేషం. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్, ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో జరిగింది.