మలయాళంలో రీఎంట్రీ ఇవ్వనున్న ‘అక్కినేని అమల’
Published on Aug 21, 2016 2:34 pm IST

amala
ఒకప్పటి స్టార్ హీరోయిన్, ‘అక్కినేని నాగార్జున’ భార్య ‘అక్కినేని అమల’ సుమారు 2 దశాబ్దాల తరువాత మలయాళ పరిశ్రమలో రీఎంట్రీ ఇవ్వనున్నారు. కొత్త దర్శకుడు ‘ఆంటోనీ సోనీ సెబాస్టియన్’ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కేరాఫ్ సైరా భాను’ అనే చిత్రంలో అమలా కీలకమైన లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రధాన అపాత్ర అయినా ‘సైరా భాను’ పాత్రను నటి ‘మంజు వారియర్’ పోషిస్తోంది.

ఓ సాధారణ ముస్లిం గృహిణి, ఆమె కొడుకుల మధ్య నడిచే అనుబంధం పై నడిచే కథగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. అమల చివరగా మలయాళంలో 1991లో ‘మోహన్ లాల్’ సరసన ‘ఉల్లడక్కం’ చిత్రంలో నటించింది.

 
Like us on Facebook