ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “అమరన్”

ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “అమరన్”

Published on Dec 5, 2024 6:59 AM IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు పెరియసామి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రమే “అమరన్”. అమరవీరుడు ముకుంద వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ బయోపిక్ చిత్రం థియేటర్స్ లో సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు సాధించింది.

ఇలా థియేటర్స్ లో అదరగొట్టిన ఈ చిత్రం మంచి ఎట్టకేలకు ఇపుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో నేటి నుంచి ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి అప్పుడు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డెఫినెట్ గా ఈ చిత్రాన్ని ఇపుడు ట్రై చేయవచ్చు.

అమరన్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు