అల్లు అర్జున్ సినిమాలకు గతంలో ఎన్నడూ లేనంత క్రేజ్ ‘S/O సత్యమూర్తి’ సినిమాకు ఉందంటే అతిశయోక్తి కాదు. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఇంతకుముందు వీరిద్దరి కలయికలో ‘జులాయి’ వంటి సూపర్ హిట్ సినిమా రావడం, త్రివిక్రమ్ గత చిత్రం ‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలవడం, ఇక అల్లు అర్జున్ గత చిత్రం ‘రేసుగుర్రం’ అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం వంటి కారణాల వల్ల సినిమాపై ఇటు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోను విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
ఈ అంచనాలకు తోడు ఇప్పటికే రిలీజైన ఆడియో, ట్రైలర్, పోస్టర్స్ ‘S/O సత్యమూర్తి’పై మరింత అంచనాలను పెంచాయి. తాజాగా ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోవడం విశేషంగా కనిపిస్తోంది. ఓ ప్రముఖ చానల్ సుమారు 8.85కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సినిమా సాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌లతో పాటు హీరోయిన్లు సమంత, నిత్యామీనన్, అదా శర్మలు సినిమాకు ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు. భారీ అంచనాల మధ్య రేపు (ఏప్రిల్ 9) S/O సత్యమూర్త్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
