పవన్ ‘భీమ్లా నాయక్’కి ఓటీటీ నుంచి భారీ ఆఫర్?

Published on Oct 23, 2021 3:02 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర “భీమ్లా నాయక్‌” పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వదిలిన పవన్ కళ్యాణ్ టీజర్‌కు, టైటిల్ సాంగ్‌కు మరియు రానా ఫ‌స్ట్ గ్లింప్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు అమెజాన్ నుంచి భారీ ఆఫర్ వచ్చి పడిందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.150 కోట్ల ఆఫర్ ఇచ్చిందని టాక్. కానీ ఈ సినిమాను మేకర్స్ థియేటర్లలో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి జంటగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :