ఏఎంబీ సినిమాస్ లో లవ్ స్టోరీ హవా!

Published on Oct 20, 2021 3:39 pm IST

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రం సూపర్ హిట్ విజయం సాధించింది. ఈ చిత్రం యూ ఎస్ లో సైతం భారీ వసూళ్ళను రాబట్టడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో లవ్ స్టొరీ చిత్రం ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం వసూళ్ల పై ఏ ఎం బీ సినిమాస్ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది.

లవ్ స్టోరీస్ సక్సెస్ స్టోరీస్ అంటూ చెప్పుకోచ్చింది. దాదాపు 251 షో లకి గానూ ఏ ఎం బీ సినిమాస్ లో మొత్తం 48,233 మంది సినిమాను చూసినట్లు తెలపడం జరిగింది. ఈ మేరకు కోటి రూపాయలు కలెక్ట్ చేసినట్లు ప్రకటించడం జరిగింది. ఈ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, కంగ్రాట్స్ తెలపడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More