అమీ తుమీ హవా రోజురోజుకూ పెరుగుతోంది !


కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన అమీతుమీ చిత్రం హవా రోజురోజుకూ పెరుగుతోంది.ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో సోమవారం కూడా ప్రేక్షకులు ఎగబడుతున్నారు.

కాగా ఈ చిత్ర టీం శుక్రవారం నుంచి విజయ యాత్రకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో కామెడీకి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. వెన్నెల కిషోర్ ఒంటి చేత్తో చిత్రాన్ని నడిపించారు.వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ కు ప్రేక్షుకుల నుంచి మంచి స్పందన వస్తోంది.మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఈషా హీరోయిన్ గా నటించింది. మణిశర్మ సంగీతాన్ని అందించారు.