టాక్ షో ప్రకటించిన స్టార్ కపుల్‌.. విడాకుల వార్తలకు ఇక ఫుల్ స్టాప్ !

టాక్ షో ప్రకటించిన స్టార్ కపుల్‌.. విడాకుల వార్తలకు ఇక ఫుల్ స్టాప్ !

Published on Nov 14, 2022 1:00 PM IST

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పట్లో ఈ వార్త ఓ సంచలనం. మొత్తానికి తన పెళ్లితో సానియా అప్పట్లో అందర్నీ షాక్ కి గురి చేసింది. ఐతే.. తాజాగా ఓ వార్త కారణంగా సానియా మీర్జా ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తన భర్త షోయబ్ మాలిక్‌‌ తో ఆమె విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆ రకంగా ఈ జంట మరోసారి వార్తల్లోకి వచ్చారు.

ఇక వీరు కూడా విడాకులు బాట పడుతున్నారు అని అందరూ నమ్మారు. కానీ అంతలోనే.. ఈ జంట ఒక టాక్ షోను ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ స్టార్ కపుల్‌ తమ షో పోస్టర్‌ను షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో “ది మిర్జా మాలిక్’ షో అతి త్వరలో ఉర్దూఫ్లిక్స్‌లో మాత్రమే” అని రాసి ఉంది. ఉర్దూఫ్లిక్స్ పాకిస్తాన్ యొక్క మొదటి ఉర్దూ ఓటీటీ ప్లాట్‌ ఫామ్. ఈ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ లోనే సానియా – షోయబ్ కలిసి షో చేయబోతున్నారు. సానియా నుంచి వచ్చిన ఈ పోస్ట్ విడాకుల వార్తలకు ఇక ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు