ఆకట్టుకుంటున్న ‘అమిగోస్’ మోన్స్టర్ థీమ్ వీడియో

Published on Feb 11, 2023 10:00 pm IST


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమిగోస్. ఒకే పోలికలు కలిగిన ముగ్గురు వ్యక్తుల జీవితం నేపథ్యంలో ఆకట్టుకునే కథ కథనాలతో రూపొందిన ఈ మూవీలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని భారీ స్థాయిలో నిర్మించారు.

జీబ్రాన్ సంగీతం అందించిన ఈ మూవీ నిన్న ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం బాగా కలెక్షన్ తో దూసుకెళుతోంది. కాగా ఈ మూవీ నుండి కీలకమైన మైఖేల్ పాత్రకి సంబంధించి నేడు మోన్స్టర్ థీమ్ వీడియోని రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఈ పాత్రలో కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ నుండి మంచి స్పందన లభిస్తోంది. ఇక మూడు పాత్రల్లో కూడా కళ్యాణ్ రామ్ ఎంతో బాగా నటించి ఆకట్టుకున్న అమిగోస్ కి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :