ఆకట్టుకుంటోన్న ‘అమిగోస్’ నుండి మోస్ట్ అవైటెడ్ సాంగ్ ప్రోమో

Published on Jan 27, 2023 8:21 pm IST


నందమూరి కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైం ట్రిపుల్ రోల్ చేస్తున్న మూవీ అమిగోస్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్ర రెడ్డి రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది. యాక్షన్ తో కూడిన థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీ పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. జీబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సౌందర్ రాజన్ డీవోపీ గా వర్క్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే అమిగోస్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, ఫస్ట్ సాంగ్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

అయితే విషయం ఏమిటంటే, గతంలో బాలకృష్ణ, దివ్యభారతి కలయికలో తెరకెక్కిన ధర్మక్షేత్రం మూవీలోని ఎన్నో రాత్రులొస్తాయి కానీ అనే పల్లవి సాగే మెలోడియస్ సాంగ్ ని ఈ మూవీలో రీమిక్స్ చేస్తున్నట్లు యూనిట్ ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇక నేడు అందరూ ఎదురు చూస్తున్న ఆ మోస్ట్ అవైటెడ్ సాంగ్ యొక్క ప్రోమోని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేసారు. ఎస్పీ చరణ్, సమీరా భరద్వాజ్ అద్భుతంగా పాడిన ఈ సాంగ్ ప్రోమో ప్రస్తుతం మంచి వ్యూస్ తో ఆకట్టుకుంటోంది. కాగా ఫుల్ లిరికల్ సాంగ్ ని జనవరి 29న సాయంత్రం 5 గం. 9 ని. లకు రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :