‘అమిగోస్’ స్టోరీనే కళ్యాణ్ రామ్ గారిని సెలెక్ట్ చేసుకుంది – డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి

Published on Feb 7, 2023 1:00 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తొలిసారిగా ట్రిపుల్ రోల్ చేస్తున్న మూవీ అమిగోస్. ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి జీబ్రాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఫిబ్రవరి 10న భారీ స్థాయిలో ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పోస్టర్స్ , టీజర్, సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయి మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి నేడు ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ, ఈ మూవీ కోసం హీరో కళ్యాణ్ రామ్ గారు ఎంతో కష్టపడ్డారని అన్నారు. ముఖ్యంగా స్టోరీనే కళ్యాణ్ రామ్ గారిని సెలెక్ట్ చేసుకుందని, రేపు తెరపై మూడు పాత్రల్లో ఆయన యాక్టింగ్ చూసి ఆడియన్స్ ఎంతో థ్రిల్ అవుతారని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు సినిమా కోసం ఏది కావలసి వస్తే అది సమకూర్చారని, తప్పకుండా అమిగోస్ మీ అందరి అంచనాలు అందుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం :