వైరల్ పిక్ : చరణ్, ఉపాసన లతో అమీర్ ఖాన్

Published on Jun 28, 2022 7:00 pm IST

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ శంకర్ తో ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇటీవల తన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భగా భార్య ఉపాసనతో కలిసి విదేశాలకు హాలిడే వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చిన చరణ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కబీ ఈద్ కబీ దీవాలి మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుండడంతో మెగా ఫ్యామిలీని నిన్న ప్రత్యేకంగా కలిశారు సల్మాన్.

అయితే సల్మాన్ తో పాటు మెగా ఫ్యామిలీని కూడా కలిసేందుకు నిన్న హైదరాబాద్ విచ్చేసిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమిర్ ఖాన్, చరణ్ ఉపాసన దంపతుల ఆతిధ్యం స్వీకరించినట్లు తెలుస్తోంది. ఆ సందర్భంగా అమీర్ ఖాన్ తో కలిసి దిగిన పిక్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసిన ఉపాసన, తన పెట్ రైమ్ ఈ మధ్య పలువురు అతిథుల రాకతో ఎంతో ఎంజాయ్ చేస్తోందని సరదాగా తన పోస్ట్ లో తెలిపారు. ఉపాసన ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :