“చోర్ బజార్” సాంగ్ పై ఏకంగా అమితాబ్ ఇంట్రెస్టింగ్ రిప్లై.!

Published on Jun 24, 2022 8:00 am IST


ఈరోజు టాలీవుడ్ దగ్గర రిలీజ్ అయ్యినటువంటి చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆకాష్ పూరి హీరోగా గేహన సిప్పి హీరోయిన్ గా నటించిన చిత్రం “చోర్ బజార్” కూడా ఒకటి. దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన ఈ లేటెస్ట్ చిత్రం మంచి అంచనాలు నడుమ విడుదల కాగా తాజాగా ఈ సినిమాపై ఏకంగా బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించడం ఆసక్తిగా మారింది.

ఈ సినిమాలో అమితాబ్ పై డిజైన్ చేసిన ఒక సాంగ్ పై తాను రిప్లై ఇస్తూ ట్వీట్ చేశారు. చెప్పడానికి మాటల్లేవని చాలా సంతోషంగా ఉంది అంటూ చోర్ బజార్ టీం వారు ఇచ్చిన ట్రీట్ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా ఐవి ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు రిలీజ్ చేశారు.

సంబంధిత సమాచారం :