వెట్టైయాన్: సూపర్ స్టార్ తో కలిసి సెట్స్ లో చేరిన అమితాబ్ బచ్చన్!

సూపర్ స్టార్ రజనీకాంత్ గతేడాది జైలర్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. చివరిసారిగా లాల్ సలాం అనే మూవీ లో గెస్ట్ రోల్ లో కనిపించారు. ఇప్పుడు ఆయన వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అందులో టి.జే. జ్ఞానవేల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న వెట్టైయాన్ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం ఇప్పుడు ముంబై లో షూటింగ్ ను జరుపుకుంటుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటుగా, అమితాబ్ బచ్చన్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యారు. మేకర్స్ ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతేకాక వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఇవి అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. రానా దగ్గుపాటి మరొక కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version