“ఒకే ఒక జీవితం” నుండి అమ్మ ప్రోమో సాంగ్ విడుదల

Published on Jan 25, 2022 7:16 pm IST

శర్వానంద్, రీతూ వర్మ హీరో హీరోయిన్ లుగా శ్రీ కార్తీక్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఒకే ఒక జీవితం. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ పతాకం పై S R ప్రకాష్ బాబు మరియు, S R ప్రభు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి అమ్మ ప్రోమో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ పాటను రాయగా, ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడటం జరిగింది.

అమ్మ ఫుల్ లిరికల్ సాంగ్ రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్, అలీ, రవి రాఘవేంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బేజాయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ప్రోమో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :