రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో తెరకెక్కుతున్న ‘అనకాపల్లి’ సినిమా నుంచి “అమ్మోరు దిగినాది..” అనే జాతర పాటను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా విడుదలైన ఈ జాతర పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సింగర్ మంగ్లీ తన గాత్రంతో అదరగొట్టగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో నటి సంగీత వేసిన స్టెప్పులు హైలైట్‌గా నిలిచాయి. గణేష్ సలాది సాహిత్యం, దేవజండ్ సంగీతం పాటకు మరింత వన్నె తెచ్చాయి. పల్లెటూరి జాతరను కళ్లకు కట్టినట్లు అత్యంత గ్రాండియర్‌గా ఈ పాటను తెరకెక్కించారు.
మాస్ యాక్షన్, యూత్‌ఫుల్ లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించడమే కాకుండా ఓ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రాగా, త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
