బాలక్రిష్ణ, ఆర్జీవీలలో ఆ పనిని ముందుగా ఎవరు చేస్తారు?


నందమూరి బాలక్రిష్ణ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మలు ప్రస్తుతం ఒకే టార్గేట్ మీద పనిచేస్తున్నారు. అదే ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కించడం. విశేషమైన ఎన్టీఆర్ జీవితాన్ని బయోపిక్ గా తీయడం తన ధ్యేయమని బాలయ్య చాల రోజుల క్రితమే ప్రకటించి, ఒక టీమ్ ను ఏర్పాటు చేసి స్క్రిప్ట్ పనులు కూడా చేస్తున్నారు. మరోవైపు వర్మ కూడా బాలక్రిష్ణ ప్రకటన చేసిన సమయంలోనే రామారావుగారి బయోపిక్ ను తీయడానికి తానే సరైన దర్శకుడినని చెప్పి రీసెర్చ్ కూడా ముగించేశారు.

ఎన్టీఆర్ జీవితాన్ని లక్ష్మీ పార్వతి కోణంలో తీస్తే ఎన్నో వాస్తవాలు, నిజాలు, అప్పట్లో ఆయన చుట్టూ నెలకొన్న పరిస్థితులు స్పష్టంగా తెలుస్తాయి. అందుకే సినిమాకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్ పెడదామనుకుంటున్నాను. దీని వలన ఎన్టీఆర్ నిజ జీవితంలో జరిగిన అనేక సంఘటనలు, వాటిలోని నిజాలు, అబద్దాలు, ఆయన్ను వెన్నుపోటు పొడిచిన వారి వెనకున్న వాస్తవాలు బయటికొస్తాయి అన్నారు.

ఇలా వర్మ ఆసక్తికరమైన స్టేట్మెంట్స్ ఇవ్వడంతో అన్నగారి అభిమానుల్లో ఇంతకీ బయోపిక్ ను ముందుగా బాలక్రిష్ణ చేస్తారు లేకపోతే వర్మ చేస్తారా, ఒకవేళ ముందుగా వర్మ చేస్తే ఎలా చేస్తాడో చెప్పేశాడు, మరి బాలక్రిష్ణ అయితే ఎలా రూపొందిస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనుక వీరిద్దరిలో ఎవరో ఒకరు సినిమాపై పూర్తి క్లారిటీ ఇస్తే ప్రేక్షకుల్లో ఉన్న కన్ఫ్యూజన్ తొలగిపోతుంది.