నాని “అంటే సుందరానికి” జీరోత్ లుక్ పై వినూత్న అప్డేట్.!

Published on Dec 30, 2021 4:27 pm IST

నాచురల్ స్టార్ నాని నుంచి ఈ ఏడాది విడుదల అయ్యిన రెండు సినిమాలు కూడా మంచి ఆదరణను అందుకున్నాయి. మరి తాజాగా విడుదల అయ్యిన “శ్యామ్ సింగ రాయ్” సినిమా అయితే తన కెరీర్ లో మరో బెస్ట్ హిట్ గా దూసుకెళ్తుండగా తన నెక్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “అంటే సుందరానికి” నుంచి ఆసక్తికర అప్డేట్ ని మేకర్స్ ఇప్పుడు రివీల్ చేశారు.

దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి నాని ఫస్ట్ లుక్ పోస్టర్ ని కాదు జీరోత్ లుక్ అంటూ వినూత్న అప్డేట్ ని అందించారు. ఈ జీరోత్ లుక్ ని కొత్త సంవత్సరం జనవరి 1న 2022 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే ఇందులో నాని చేస్తున్న పాత్ర సుందరం పేరు కూడా చెప్తున్నారు.

“కే పి వి ఎస్ ఎస్ పి ఆర్ సుందర్ కుమార్” అంటూ కేజ్రీగా ప్రెజెంట్ చేశారు. మరి ఈ లుక్ లో నాని ఇంకెంత కొత్తగా ఉంటాడో చూడాలి మరి. ఇక ఈ సినిమాలో నాని సరసన మొదటి సారిగా నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :