టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి మాస్ లో ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు దర్శకుడు కొరటాల శివతో భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దీనిని కంప్లీట్ యాక్షన్ డ్రామాగా ప్రామిస్ చేయడంతో అంచనాలు ఓ రేంజ్ లోకి వెళితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అనిరుద్ లాక్ అవ్వడం సినిమా మోషన్ పోస్టర్ టీజర్ లోనే సెన్సేషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంతో ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి.
అయితే లేటెస్ట్ గా అనిరుద్ ఇచ్చిన మ్యూజికల్ కాన్సెర్ట్ లో ఒక పవర్ఫుల్ విజువల్ ఫ్యాన్స్ కి కేజ్రీగా మార్చేసింది. అనిరుద్ తన లైవ్ పెర్ఫామెన్స్ ఇస్తున్న సమయంలో బ్యాక్గ్రౌండ్ లో అయితే దేవర గా ఎన్టీఆర్ విజువల్ కనిపిస్తుంది. దీనితో ఈ పిక్ మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో హై ని ఇస్తుంది. ఇదే ఇలా ఉంటే ఇక అనిరుద్ సారథ్యంలో దేవర ఆడియో ప్రీ రిలీజ్ వేడుక ఎలా ఉంటుందో అని అనుకుంటున్నారు. మొత్తానికి అయితే ఈ పిక్ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో గట్టిగానే వైరల్ గా మారింది.
ALL HAIL TIGER ????????#Anirudh Musical Concert ????????@tarak9999 #ManOfMassesNTR #Devara pic.twitter.com/I9U3eXuKfl
— AndhraNTRFC (@AndhraNTRFC) February 27, 2024


