చిరు సినిమా చూడడానికి ఊరే కదిలి వచ్చిందట!

చిరు సినిమా చూడడానికి ఊరే కదిలి వచ్చిందట!

Published on Feb 6, 2017 11:50 AM IST


తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏళ్ళుగా సినిమా అన్నది మొట్టమొదటి ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్‌గా కొనసాగుతూ వస్తోంది. ముఖ్యంగా ఇప్పట్లా సోషల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ చానల్స్ లాంటివి లేనిరోజుల్లో అయితే సినిమా అన్నది ఏకైక ఆప్షన్. అలాంటి రోజుల్లో బండ్లు కట్టుకొని మరీ, ఊరు ఊరే కదిలి సూపర్ హిట్ సినిమాలను చూసేవారన్నది పేరు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన రీ ఎంట్రీ సినిమా అయిన ‘ఖైదీ నంబర్ 150’ విషయంలో ఇది జరిగింది.

గుంటూరు జిల్లాలోని తక్కెళ్ళపాడు గ్రామవాసులంతా చిరంజీవిపై తమకున్న అభిమానాన్ని చూపాలన్న ఉద్దేశంతో తమ ఎడ్లబండ్లను కట్టుకొని నారాయణపురం అనే పక్కనే ఉండే ఊర్లోని అలంకార్ థియేటర్‌కు వెళ్ళారట. ఊరంతా కలిసి ఇలా ఈ కాలంలో ఒక సినిమా చూడడం అన్నది విశేషంగా చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో చిరు అభిమానులు ఈ విషయాన్నే ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు. 9 ఏళ్ళ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి చిరు చేసిన ‘ఖైదీ నంబర్ 150’, రికార్డులన్నీ తిరగరాసి ఆయన స్టామినాను మళ్ళీ పరిచయం చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు