ఇంట్రెస్టింగ్..శంకర్, చరణ్ ల భారీ చిత్రంపై ఈ డీటైల్.!

Published on Sep 8, 2021 8:34 pm IST


ఈరోజు టాలీవుడ్ మరో మోస్ట్ అవైటెడ్ చిత్రం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు విజనరీ డైరెక్టర్ శంకర్ ల కాంబోలో తమ బెంచ్ మార్క్ చిత్రం 15వ ప్రాజెక్ట్ చాలా గ్రాండ్ గా అనౌన్స్ అయ్యిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ సహా అనేక మంది సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సాలిడ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. మరి ఈ భారీ చిత్రం ఇంకా స్టార్ట్ అయ్యిందని మేకర్స్ ఒక ఆసక్తికర పోస్టర్ ని డిజైన్ చేసిన శంకర్ మార్క్ తో వచ్చింది..

అయితే ఈ పోస్టర్ ని అంతా డీకోడ్ చెయ్యడం మొదలు పెడితే ఇంట్రెస్టింగ్ డీటెయిల్ కనిపిస్తుంది. అలా చరణ్ మరియు కియారా లు ఏవో ఫైల్స్ పట్టుకొని వెళ్తున్నారు. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోగో కనిపిస్తుంది.. దీనితో ఈ సంబంధిత బ్యాక్ డ్రాప్ లో సినిమా ఏమన్నా కనిపిస్తుందా అన్న డౌట్స్ స్టార్ట్ అయ్యాయి.

పైగా వీరి వేషధారణ కూడా ఆసక్తికరంగా కనిపిస్తుండడంతో శంకర్ నుంచి మళ్ళీ ఓ సాలిడ్ సబ్జెక్ట్ వస్తుందని అర్ధం అవుతుంది. జెనరల్ గా అయితే శంకర్ తన సినిమాల కథని పెద్దగా రివీల్ చెయ్యరు.. మరి ఈ సినిమా విషయంలో ఏం చూపించనున్నారో ఎదురు చూడాలి.

సంబంధిత సమాచారం :