“మనీ హెయిస్ట్” ఫ్యాన్స్ కి ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్.!

Published on Dec 1, 2021 9:00 pm IST


ప్రపంచ వ్యాప్తంగా కూడా ఓటిటి ప్రపంచంలో ఎంతో ఆదరణ కలిగిన అతి తక్కువ హిట్ వెబ్ సిరీస్ లలో నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యే స్పానిష్ సిరీస్ “లకాసా డి పాపెల్”( ది మనీ హెయిస్ట్ ) కూడా ఒకటి. గ్లోబల్ గా కూడా అన్ని భాషల్లో హిట్ గా నిలిచిన ఈ సిరీస్ లో కొన్ని పాత్రలకి కూడా సెపరేట్ క్రేజ్ ఉంది.

మరి అలాంటి వాటిలో మొదటగా నిలిచేది ప్రొఫెసర్ పాత్ర అయితే ఆ తర్వాత లిస్ట్ లో డెఫినెట్ గా ఉండే పేరు బెర్లిన్. అలాగే ఓ రకంగా చెప్పాలంటే ఒకింత ఎక్కువ క్రేజ్ కూడా దీనికే ఉంది. మరి ఇప్పుడు ఈ సిరీస్ లోని బెర్లిన్ ఫ్యాన్స్ కోసమే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ని నెట్ ఫ్లిక్స్ వారు రివీల్ చేశారు.

ఇప్పుడు మొత్తంగా ఈ మనీ హెయిస్ట్ నుంచి ఫైనల్ సీజన్ కి ఎండ్ కార్డ్ పడనుండగా దీని తర్వాత బెర్లిన్ రోల్ పై ఇంకో స్పెషల్ సిరీస్ ప్లానింగ్ లో ఉందట. అంటే ఇంకో రకంగా మనీ హెయిస్ట్ అభిమానులకి ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. మరి ఈ సిరీస్ ని 2023లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :