ఆడియెన్స్ ని థ్రిల్ చెయ్యడానికి రెడీ అవుతున్న “ఆన్ ఎయిర్”.!

ఆడియెన్స్ ని థ్రిల్ చెయ్యడానికి రెడీ అవుతున్న “ఆన్ ఎయిర్”.!

Published on Jul 9, 2022 2:00 PM IST

శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో ఎం జి శ్రీనివాస్ (శ్రీని) పరిచయం అక్కర్లేని పేరు. హీరో గా, దర్శకుడిగా కన్నడ లో బీర్బల్ ట్రైయాలజీ, ఓల్డ్ మోంక్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి సంచలనం సృష్టించిన తాను ఇప్పుడు మరో విభిన్న థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమానే ‘ఆన్ ఎయిర్’. ఇంటరెస్టింగ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంలో శ్రీని ఆర్ జే గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అసోసియేట్ ప్రశాంత్ సాగర్ ‘ఆన్ ఎయిర్’ కు దర్శకత్వం వహించగా వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రఘువీర్ గోరిపర్తి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, చిత్ర కథ ఎంతో వినూత్నంగా ఉండి ప్రేక్షకులకు ఒక విభిన్నమైన చిత్రం చూడబోతున్నాం అనే అంచనాలు ఏర్పరిచింది ఆన్ ఎయిర్.

ఈ చిత్రంలో ఏం జీ శ్రీనివాస్ ఆర్ జే గా నటిస్తున్న ఈ చిత్రం లో, ఆర్ జే గా తన మొదటి రోజే వచ్చిన ఒక కాల్ తో తన జీవితం లో ఎలాంటి పెను మార్పులు చోటుచేసుకున్నాయి అని ఒక వినూత్నమైన స్క్రీన్ ప్లే తో ఎంతో ఉత్కంఠగా ఆన్ ఎయిర్ తెరకెక్కింది. శ్రీని పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తన అద్భుత నటనతో ఈ థ్రిల్లర్ ను ఇంకో లెవెల్ కి తీసుకెళ్లారు. ఆన్ ఎయిర్ ఎంతో బలమైన కంటెంట్ ను కలిగి ఉండి అంతే స్థాయిలో ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందింది.

జూలై 9న శ్రీని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆన్ ఎయిర్ గ్లింప్స్ ను విడుదల చేశారు. గ్లింప్సె్ చిత్ర మూడ్ ను తెలియజేసే విధంగా ఉంటూ హాంటింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎంతో ఆకట్టుకుంటోంది.

దర్శకుడు ప్రశాంత్ సాగర్ ఈ చిత్రాన్ని కేవలం 35 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి పకడ్బందీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే పూర్తి చేశారు. రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు ఏ మాత్రం రాజీ పడకుండా టాప్ క్లాస్ ప్రొడక్ట్ ఇవ్వాలని ఆన్ ఎయిర్ ను నిర్మిస్తున్నారు. చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవనుంది. అతి త్వరలో ఒక టాప్ ఓటిటి యాప్ లో ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు