బాలయ్య మాస్ నెక్స్ట్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతోందా?

బాలయ్య మాస్ నెక్స్ట్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతోందా?

Published on Aug 4, 2022 9:00 AM IST


ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అందరికీ తెలిసిందే. అలాగే దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య తన కెరీర్ లో 107వ సినిమాగా చేస్తుండడంతో మంచి అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయి.

ఇక వీటికి తగ్గట్టుగానే దర్శకుడు మాస్ టేకింగ్ ఈ సినిమాపై చూపిస్తుండడంతో బాలయ్య ఫ్యాన్స్ కి కూడా మంచి ఎగ్జైట్మెంట్ నెలకొంది. అయితే ఈ సినిమా టైటిల్ కోసం అయితే అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పుడు అయితే ఓ ఇంట్రెస్టింగ్ టాక్ బయటకి వచ్చింది.

మేకర్స్ ఈ నెల రాఖీ పూర్ణిమ సందర్భంగా ఓ స్పెషల్ అప్డేట్ ని అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. ఒక స్పెషల్ పోస్టర్ గాని లేదా వేరే ఇతర ఇంట్రెస్టింగ్ అప్డేట్ రావచ్చని తెలుస్తుంది. మరి దీనిపై అయితే మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు