“హిట్ 2” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కి టైం ఫిక్స్.!

Published on Dec 17, 2021 3:35 pm IST

న్యూ ఏజ్ టాలీవుడ్ లో ఇప్పుడు అనేక మంది కొత్త తరం దర్శకులు సరికొత్త కాన్సెప్ట్ లతో ముందుకు వస్తున్నారు. అలా ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు వచ్చి థ్రిల్ చేసాయి. మరి ఈ లిస్ట్ లో టాలీవుడ్ ఆడియెన్స్ ని థ్రిల్ చేసిన మరో సినిమా “హిట్”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో మొదటి సినిమాని యంగ్ హీరో విశ్వక్ సేన్ తో మేకర్స్ తెరకెక్కించి హిట్ కొట్టారు. అయితే ఈ సినిమా సక్సెస్ తో ఆల్రెడీ రీమేక్ ఆఫర్ కూడా వచ్చి బాలీవుడ్ లో తెరకెక్కుతుంది.

ఇక దీనితో ఈ ఫ్రాంఛైజ్ కి కొనసాగింపుగా ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అయిన ఇంకో టాలెంటెడ్ నటుడు అడివి శేష్ ని పార్ట్ 2 కి అనౌన్స్ చెయ్యడం జరిగింది. మరి ఈ రోజు శేష్ బర్త్ డే కానుకగా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఈరోజు రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు నాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ అయ్యినటువంటి వాల్ పోస్టర్ సినిమా వారు కన్ఫర్మ్ మరి ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటో చూడాలి.

సంబంధిత సమాచారం :