“రాధే శ్యామ్” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతోందా?

Published on Feb 20, 2022 11:00 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ భారీ పీరియాడిక్ వండర్ చిత్రం ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మరి ఇదిలా ఉండగా మొన్న వాలెంటైన్స్ డే తర్వాత నుంచి మేకర్స్ కాస్త సైలెంట్ గానే ఉన్నారు.

కానీ ఇక నుంచి అసలు రచ్చ స్టార్ట్ చెయ్యడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మరి ప్రమోషన్స్ పక్కన పెడితే.. ఈ రెండు రోజుల్లో ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి అది సినిమా నెక్స్ట్ సాంగ్ కోసమా లేక వేరే ఏమన్నానా అని తెలియాల్సి ఉంది. దీనితో ఇప్పటి నుంచే అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాకి టోటల్ గా నలుగురు సంగీత దర్శకులు వర్క్ చెయ్యగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :