“వాల్తేరు వీరయ్య” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుందా?

“వాల్తేరు వీరయ్య” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుందా?

Published on Nov 10, 2022 6:04 PM IST


మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సాలిడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. వింటేజ్ మెగాస్టార్ ని చూపిస్తూ రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ కే అదిరే రెస్పాన్స్ వచ్చింది. ఇక నెక్స్ట్ కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రాబోతున్నాయని కూడా మేకర్స్ కొన్ని రోజులు కితమే అనౌన్స్ చేశారు.

మరి అలా ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఈ రానున్న వారాంతంలో అలా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అయితే రివీల్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా ఇప్పుడు బజ్ వినిపిస్తుంది. మరి ఈ చిత్రంలో సాంగ్స్ ఆల్రెడీ డీఎస్పీ కంపోజ్ చెయ్యగా వాటిలో ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ ఈ వారం రోజుల్లో అనౌన్సమెంట్ ఇవ్వనున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అయితే అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు