“భీమ్లా నాయక్” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Aug 18, 2021 7:02 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్” ఒకటి. అనుకున్న దానికంటే ఎక్కువ హైప్ నే ఈ చిత్రం ఇప్పుడు తెచ్చుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయ్యినటువంటి ఫస్ట్ గ్లింప్స్ తో భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం అంతకు ముందు ఉన్న ఇండియన్ రికార్డులను సైతం బద్దలుగొట్టింది.

మరి ఇదిలా దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రం ఇప్పటికే చాలా మేర షూటింగ్ కంప్లీట్ అయ్యిన సంగతి తెలిసిందే. కానీ మేకర్స్ మళ్ళీ కొన్ని రీషూట్స్ చేస్తున్నారట. అలాగే మొన్న వచ్చిన గ్లింప్స్ లో కనిపించిన సాలిడ్ మాస్ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా మళ్ళీ తెరకెక్కిస్తున్నట్టు టాక్.

మరి ఈ రీషూట్స్ తో ముందు అవుట్ పుట్ కన్నా కూడా అదిరే విజువల్స్ వచ్చాయని తెలుస్తుంది. మొత్తానికి మాత్రం సాలిడ్ ఎలిమెంట్స్ ఈ చిత్రాన్ని మేకర్స్ తీర్చిదిద్దుతున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :