‘డ్రాగన్’ ఇంటర్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

NTR Neel

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్) పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ లో ఓ భారీ ఫైట్ ను ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్. ఎగురుతున్న ఫ్లైట్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ చాలా గ్రాండ్ విజువల్స్ తో ఉంటుందని.. ముఖ్యంగా సినిమాలో వచ్చే మెయిన్ ట్విస్ట్ కి లీడ్ గా ఈ ఫైట్ ఉంటుందని.. పైగా సినిమా మొత్తంలోనే ఈ యాక్షన్ ఎపిసోడ్ మెయిన్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. అన్నట్టు ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తోంది. ఐతే, ఈ సారి ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట.

పైగా బ్లాక్ షేడ్ ఫ్రేమ్ కూడా సినిమాలో కనిపించదట. కాగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. అనిల్ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version