దర్శకుడ్ని కాకపోయి ఉంటే డ్రైవర్ ని అయ్యేవాడినేమో !

Published on Oct 31, 2021 9:48 pm IST

క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాలో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా నటిస్తున్నారు. అదే విధంగా ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటి సారి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి ఇండియా వైడ్ గా బజ్ ఉంది.

తాజాగా రాజమౌళి.. వైద్య కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘విజయం కావాలంటే తగిన ప్రయాణం అవసరమని నేను నమ్ముతాను. ఏ కథ అయినా నన్ను బాగా ప్రేరేపించాలి. అప్పుడే దాన్ని తెరకెక్కిస్తా’ అని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెలిపారు. ‘దర్శకుడు కాకపోయి ఉంటే ఏమయ్యేవారు ?’ అని అడిగితే… ‘నాకు డ్రైవింగ్‌ వచ్చు. ఒకవేళ దర్శకుడ్ని కాకపోయి ఉంటే డ్రైవర్ ని అయ్యేవాడినేమో’ అని రాజమౌళి సమాధానం చెప్పాడు .

సంబంధిత సమాచారం :

More