సర్కారు వారి ‘పాట’ అధికారిక ప్రెస్ నోట్ వదిలిన మేకర్స్.!

Published on Jan 15, 2022 7:05 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమా “సర్కారు వారి పాట” సినిమా కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురాం పెట్ల ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. మరి మహేష్ కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఈ సంక్రాంతి కానుకగా మ్యూజికల్ అప్డేట్స్ ని అందిస్తామని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ విషయాన్ని గత కొన్ని రోజుల కితమే మళ్లీ చెప్పారు.

కానీ ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ సాంగ్ కి సంబంధించి ఇప్పుడు ఒక అధికారిక అప్డేట్ ని ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసారు. ప్రస్తుత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంక్రాంతి కి ఇస్తామన్న మ్యూజికల్ అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాం అని అలాగే ముందు అప్డేట్స్ కోసం సంబంధించి త్వరలోనే తెలియజేస్తామని చెప్పి అభిమానులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి సేఫ్ గా ఉండమని వారు తెలిపారు. దీనితో ఈ పండుగకి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదని కన్ఫర్మ్ అయ్యిపోయింది.

సంబంధిత సమాచారం :