‘ఆదిపురుష్’ నుండి రేపు అప్ డేట్ ?

Published on Mar 29, 2023 11:40 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో మైథలాజికల్ జానర్ మూవీ ఆదిపురుష్ ఒకటి. ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో రాఘవ గా ప్రభాస్, సీత గా కృతి సనన్, లక్ష్మణ్ గా సన్నీ సింగ్, లంకేష్ గా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితం పూర్తి కాగా ప్రస్తుతం విఎఫ్ ఎక్స్ వర్క్ జరుగుతోంది.

ఇప్పటికే ఆదిపురుష్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై అంచనాలు ఏర్పరిచాయి. కాగా రేపు శ్రీరామనవమి సందర్భంగా యూనిట్ ఉదయం ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. భారీ విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీని టి సిరీస్, రిట్రో ఫైల్స్ సంస్థలు ఎంతో భారీ వ్యయంతో నిర్మించాయి. కాగా ఈ మూవీ జూన్ 16న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :